పుదుచ్చేరి: మృతి చెందిన కరోనా రోగి పట్ల వైద్య సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని నిర్లక్ష్యంగా గోతిలో విసిరేసి వెళ్లిన దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరిలో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వైద్య సిబ్బంది అంబులెన్స్ నుంచి కోవిడ్-19తో మరణించిన వ్యక్తిని కిందకు తీశారు. అనంతరం హడావుడిగా సదరు వ్యక్తి శవాన్ని గొయ్యిలోకి విసిరేశారు. ఇందులో ఒకరు శవాన్ని విసిరేశామని చెప్పగానే అక్కడున్న అధికారి అంగీకారంగా వేలు చూపించాడు. (కౌంట్‌డౌన్ మొదలైంది!)
పైగా చనిపోయిన వ్యక్తిని సంచిలో ఉంచకుండా కేవలం తెల్లని వస్త్రంతో చుట్టి ఉంచి ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించారు. మరోవైపు పూడ్చే సమయంలో శవంపై ఉన్న తెల్లని వస్త్రం సరిగా కప్పనేలేదు. దీనివల్ల వారికి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు మృతదేహాన్ని సరిగా పూడ్చారా? లేదా? అన్నదానిపై కూడా స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు పొక్కడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం)
Comments
Please login to add a commentAdd a comment