
న్యూఢిల్లీ: ఈశాన్య రుతుపవనాలు నవంబర్ 1న ప్రారంభమయ్యే అవకాశముందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనావేసింది. ఈ సీజన్‌లో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళలలో ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20నే ప్రారంభమవుతాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ సర్క్యులేషన్ వల్ల ఈసారి కాస్త ఆలస్యమవుతోందని ఐఎండీ తెలిపింది. మరోవైపు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వెనుదిరిగాయని వెల్లడించింది.