హైదరాబాద్‌ యువతిపై కీచకపర్వం | auto driver abused hyderabad women in puducherry | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ యువతిపై కీచకపర్వం

Published Mon, Jun 26 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

హైదరాబాద్‌ యువతిపై కీచకపర్వం

హైదరాబాద్‌ యువతిపై కీచకపర్వం

చెన్నై: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఆటోడ్రైవర్‌ అటకాయించి, అసభ్యంగా ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. పుదుచ్చేరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ విహాయాత్ర కోసమని పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ హోటల్లో రూమ్‌ అద్దెకు తీసుకుని, పలు ప్రాంతాలను తిలకించారు. ఆదివారం రాత్రి వారు అన్నాసాలై ప్రాంతంలో నిలబడి మాట్లాడుకుంటుండగా.. ఆ పక్కగా నిలబడి ఉన్న ఆటో డ్రైవర్‌ హఠాత్తుగా ఓ యువతిని అటకాయించి, కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. కీచకుడి చర్యతో నిర్ఘాంతపోయిన యువతులు కేకలు వేశారు. ఈలోపు ఆ యువకుడు ఆటోలో తప్పించుకుని పారిపోయాడు.

ఆటో నంబర్‌ను నోట్‌ చేసుకున్న యువతులు సరాసరి ఒదియంజాలై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం పుదుచ్చేరిలోని చిన్నయాపురం అక్కాస్వామి కోవిల్‌ వీధికి చెందిన స్టాలిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మద్యం మత్తులోనే తానా పని చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్టాలిన్‌ను అరెస్టు చేసి, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement