passengers troubles
-
పండగ పూట ప్రయాణికులకు పాట్లు
-
రైల్వే స్టేషన్లలో దీపావళి రద్దీ.. ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. దీపావళితో పాటు ఛత్ పూజలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ ఊళ్లకు తరలివెళుతున్నారు. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఉత్తర రైల్వే పండుగలకు ప్రత్యేక రైళ్లను నడపడమే కాకుండా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రయాణికులకు భోజన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అలాగే ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల గురించిన సమాచారాన్ని అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను, అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆర్సీఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని రైల్వే శాఖ మోహరించింది. స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ ప్రతి సంవత్సరం పండుగలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. అయితే ఈసారి పండుగను రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం
ఇటీవల కాలంలో టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా విమాన ప్రయాణాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆ సంస్థ కీర్తి ప్రతిష్టల్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా, జులై 9న సిడ్నీ నుండి ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేశాడు. ఆపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. సిడ్నీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే, ఆకాశంలో ఉండగా విమానంలోని ఓ ప్రయాణికుడు ఎకానమీ క్లాసులో తాను కూర్చున్న సీటు సరిగ్గా లేదని, బిజినెస్ క్లాస్‌లో సీటు కేటాయించాలని సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. ప్రయాణికుడి అసౌకర్యాన్ని చింతిస్తూ విమాన సిబ్బంది సీటు 30-సీలో కూర్చోవచ్చని తెలిపారు. కానీ, అవేం పట్టించుకోని ప్రయాణికుడు..రో నెంబర్ 25 కూర్చున్నాడు. పైగా పక్కనే ఉన్న మరో ప్రయాణికుడితో గొడవపడ్డాడు. అయితే, ఈ గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించిన ఉన్నతాధికారిపై దాడి చేశాడు. మెడపట్టుకుని విరిచే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విమానంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్యాసింజర్‌ను ఐదుగురు క్యాబిన్ సిబ్బంది కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి బయట పడేందుకు ఉపయోగించే ఎక్విప్మెంట్స్ ఉన్న రూమ్‌లో చొరబడడంతో కలకలం రేగింది. అయితే ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణికుడిని ఎయిరిండియా భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో తాను తప్పు చేసినట్లు నిందితుడు రాత పూర్వకంగా తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో జూలై 9, 2023న సిడ్నీ-ఢిల్లీకి ప్రయాణిస్తున్న AI-301 విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సదరు ప్యాసింజర్ రాతపూర్వకంగా క్షమాణలు చెప్పినట్లు తెలిపింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ మాట్లాడుతూ.. ఎయిర్‌లైన్స్ నిబంధల తీవ్రతను బట్టి సదరు ప్యాసింజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి : కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్ -
మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. జూన్ నుంచి వారికి ఉచిత బస్సు ప్రయాణం
బెంగళూరు: కర్ణాటక మహిళలకు ఊరట లభించింది. కొత్తగా కొలువు తీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది. జూన్ 1 నుంచి మహిళలందరూ టికెట్టు కొనుగోలు చేయకుండానే బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆర్టీసీ ఎండీలతో సమావేశమైన అనంతరం మీడియా సమక్షంలో మంగళవారం ప్రకటించారు. నో అబ్జెక్షన్స్.. రాష్ట్రంలోని మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.. ఇందుకు ఎలాంటి షరతులు లేవని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలోనూ తాము ఎలాంటి షరతులు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేబినెట్ సమావేశం బుధవారం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఖర్చులను సీఎంకు సమర్పించనున్నట్లు చెప్పారు. సీఎం సిద్ధరామయ్య కూడా రవాణా శాఖ ప్రధాన కార్యదర్శితో ఇప్పటికే ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకా ప్రజలు గణవిజయాన్ని అందించారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి:పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు -
రైలు ప్రయాణికులకు శుభవార్త
రైలు ప్రయాణంలో తమకు కావాల్సిన ఫుడ్ విషయంలో చాలా మంది అసంతృప్తి చెందుతుంటారు. ప్రాంతాలు మారుతున్న క్రమంలో సరైన ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాగా, ఇలాంటి విషయాలపై భారత రైల్వే బోర్డు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)కి రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగానే.. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై స్థానిక, ప్రాంతీయ ఆహారం కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, చిన్నారులకు, ఆరోగ్యపరంగా ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి తగిన ఆహారం అందజేయాలని సూచించింది. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రైళ్లలో కేటరింగ్ సేవలను మరింత మెరుగుపర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేబోర్డు తెలియజేసింది. అలాగే.. శిశువులు, ఫుడ్ విషయాల్లో కేర్ తీసుకునే వారి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూలో మార్పులు చేయాలని ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వారికి ప్రాంతీయ వంటకాలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, పండుగల వేళల్లో సైతం ప్రత్యేక వంటకాలను సైతం విక్రయించుకోవచ్చని ఐఆర్సీటీసీకి బోర్డు తెలిపింది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయస్సుల వారికి వారు మెచ్చే విధంగా ఫుడ్‌ను తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. భోజనంలో కాకుండా.. ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహారాలు ఎంఆర్పీ ధరకు విక్రయించేందుకు అనుమితిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లలో మెనూలో ఉండే బడ్జెట్ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్సీటీసీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. In a major relief to diabetics, parents and health enthusiasts, Railway Board has allowed IRCTC to customise its menu to include local and regional cuisines as well as food suitable for diabetics, infants and health aficionados https://t.co/MF3kqiGJkE https://t.co/I6d5oS3yWo — Economic Times (@EconomicTimes) November 15, 2022 -
800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు
న్యూఢిల్లీ: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు పైలట్ల మెరుపు సమ్మె సెగ తగిలింది. లుఫ్తాన్సా పైలట్ల యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు అన్ని ప్రయాణీకుల, కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందుల్లో పడిపోయారు. దాదాపు 800 విమానాలు రద్దు కానున్నాయని లుఫ్తాన్సా వెల్లడించింది. వేసవి సెలవుల ముగింపు తరువాత తిరిగొచ్చే అనేక మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది. అయితే తన బడ్జెట్ క్యారియర్ యూరోవింగ్స్ ప్రభావితం కాదని లుఫ్తాన్సా పేర్కొంది. పైలట్ల సమ్మె ప్రభావాలను తగ్గించడానికి సాధ్యమైనదంతా చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించినా ప్రయాణీకులకు ఇబ్బందులుత ప్పలేదు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 డిపార్చర్ గేట్ 1 వద్ద దాదాపు 150 మంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఫ్రాంక్ఫర్ట్ , మ్యూనిచ్ నుండి రెండు లుఫ్తాన్స విమానాలు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల బంధువులు ఆందోళనలో పడిపోయారు. డబ్బు వాపసు ఇవ్వండి లేదా తమ వారికి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర విమానయాన సంస్థల ద్వారా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. కాగా వేతనాల పెంపును కోరుతూ లుఫ్తాన్సా పైలట్లు అకస్మాత్తుగా భారీ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినక కారణంగా సమ్మె తప్ప లేదని పైలట్ల సంఘం వెల్లడించింది. అయితే కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల జీతాలను 900 యూరోల (900 అమెరికా డాలర్లు) ఒక్కసారిగా పెంచింది. సీనియర్ పైలట్లకు 5 శాతం, కొత్తవారికి వారికి 18 శాతం పెంపును ప్రకటించింది. కనీ 2023లో అధిక ద్రవ్యోల్బణం అంచనాల నేపథ్యంలో ఈ సంవత్సరం 5.5 శాతం పెంచాలని పైలట్లు యూనియన్ డిమాండ్ చేస్తోంది. Delhi | Crowd of approx 150 people gathered on main road in front of departure gate no.1, Terminal 3, IGI Airport, around 12 am, demanding refund of money or alternate flights for their relatives as 2 Lufthansa flights bound to Frankfurt & Munich were cancelled: DCP, IGI Airport https://t.co/V2PQBWBErD — ANI (@ANI) September 2, 2022 Students' Strike at IGI Airport Delhi, as Lufthansa cancels two flights to Germany and they ain't finding a solution, Students are in panic as most are colleges are starting from 6th and they ain't rebooking before 10th sept. @PMOIndia@JM_Scindia @lufthansa #shameonlufthansa pic.twitter.com/dkAW8LwAPL — Kuntal parmar (@Kunnntal) September 1, 2022 -
ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని మండిపడింది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్‌కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్‌లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. 2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. అదే 24 గంటలు దాటితే రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ పేర్కొంది. -
నా డ్యూటీ ముగిసింది!..ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత పైలెట్ ఝలక్
విమానాలను వాతావరణ పరిస్థితుల రీత్యా లేక సాంకేతిక లోపం కారణంగానో ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి హోటల్ వసతి కూడా ఏర్పాటు చేయడమో లేక మరో విమానంలో పంపించడమో జరుగుతుంది. అయితే ఇక్కడోక పైలెట్ మాత్రం అత్యవసర ల్యాండిగ్ తర్వాత తన డ్యూటీ ముగిసిందంటూ ...విమానాన్ని కొనసాగించాడానికి నిరాకరించాడు. అసలు విషయంలోకెళ్తే...రియాద్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత పైలెట్ తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి విమానాన్ని కొనసాగించడానికి నిరాకరించాడు. అంతే ప్రయాణికులు ఆగ్రహంతో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దమ్మామ్ విమానాశ్రయ భద్రతాధికారులను రంగంలోకి దిగింది. ఈ మేరకు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరేవరకు హోటల్లోనే వసతి కల్పించారు. అయితే విమాన భద్రత దృష్ట్యా పైలెట్ విశ్రాంతి తీసుకోవాలని, పైగా ప్రయాణికులందరూ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకునేంతవరకు వారికి హోటళ్లలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మీడియాకి తెలిపారు. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!
సాక్షి, నల్లగొండ: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. నార్కట్‌పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్.. ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో ఉడాయించారు. ట్రావెల్స్ బస్సులోనే 64 మంది ప్రయాణికుల లగేజీ ఉంది. నార్కట్‌పల్లి ఫంక్షన్ హాల్లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. బాధితుల వద్దకు నకిరేకిల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. చదవండి: బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో జీవనం కోసం వలస వెళ్లారు. కాగా స్వంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బ్రోకర్ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలు దేరగా, కూలీలను మార్గం మధ్యలో నార్కెట్‌పల్లి భోజన హోటల్ వద్ద కూలీలను దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పిన డ్రైవర్.. ఉడాయించాడు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు.. మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. -
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
కోల్‌కతా: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా విస్తారా విమానం కుదుపునకు లోనయ్యింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో కుదుపుల కారణంగా ప్రయాణికులు కొందరు గాయపడ్డారు. 15 నిమిషాల్లో కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటుందనుకున్న సమయంలో విమానం ఒక్క సారిగా భారీగా కుదుపునకు లోనైంది. దీంతో విమానంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలోనే 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించినట్లు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి విమానంలోనే ప్రథమ చికిత్స అందించి కోల్‌కతా చేరుకున్న తరువాత ఆస్పత్రికి తరలించాము. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. కాగా విస్తారా యూకే 775 విమానం మహారాష్ట్రలోని ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు సోమవారం బయల్దేరింది. 8 passengers including 3 suffered major injuries after Vistara's Mumbai-Kolkata flight hit turbulence. The 3 passengers with major injuries shifted to a local hospital in Kolkata: Kolkata Airport Director— ANI (@ANI) June 7, 2021 చదవండి: భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది సజీవ దహనం? -
కువైట్‌కు విమానాలు రద్దు
తిరువనంతపురం : కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భయాల నేపథ్యంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్ అధికారులు ప్రకటించారు. శనివారం కువైట్ ఆరోగ్య అధికారులు తీసుకున్న ఈ ఆకస్మిక ప్రయాణ నిషేధంతో కోజికోడ్ కరీపూర్ విమానాశ్రయంలో 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, లెబనాన్ నుండి కువైట్‌కు వెళ్లే అన్ని విమానయాన సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుంది. -
కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్మెంట్ ఇంతలోనే..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఆ రైల్లో వెళ్లేందుకు టికెట్లు, రిజర్వేషన్లు చేయించుకున్న దాదాపు 500 మంది ప్రయాణికులు షాక్ తిన్నారు. ఇంత దారుణమైన నిర్లక్ష్యమా? అంటూ ఆందోళనకు దిగారు. స్టేషన్ మాస్టర్ గది వద్ద ధర్నా చేపట్టారు. కనీసం రైలు రద్దయిన సమాచారాన్ని కూడా తమకు చెప్పకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో చిన్న, చిన్నపిల్లలతో ఉన్న మహిళలు తమ రైలు రద్దు కావడంతో స్టేషన్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు పిల్లలతో కలిసి ధర్నా చేశారు. -
పాక్ మరో దుందుడుకు నిర్ణయం
జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. దీంతో వాఘా సరిహద్దులోని అంతర్జాతీయ రైల్వేస్టేషన్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ, ఆర్టికల్ 370ను రద్దుచేసిన భారత్ చర్యను నిరసిస్తూ పాకిస్తాన్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను సస్పెండ్ చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోర్ డిఎస్ కార్యాలయం నుంచి వాపస్ పొందవచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నామని పాకిస్తాన్ చెబుతోంది. అలాగే పాకిస్తాన్ సినిమాహాళ్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం గమనార్హం. అయితే రైలును తిరిగి భారతకు పంపించాల్సిన బాధ్యత పొరుగు దేశం పాక్‌దేనని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. వీసా ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపినట్టు చెప్పారు. కాగా 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఫ్రెండ్షిప్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. -
వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు
సాక్షి, ముంబై: భారీ వర్షాలు, వరద బెడద మహారాష్ట్రను పట్టి పీడిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు ముంబై నగరంతోపాటు, శివారు ప్రాంతాలను స్తంభింపజేసాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రకటించారు. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే 100 కాల్ చేయాలని ముంబై పోలీసులు తెలిపారు. ఇది ఇలా వుంటే ముంబై-కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ బద్లాపూర్- వంగని మధ్య పట్టాలపై నిలిచిపోయింది. దీంతో సుమారు 2000 మందికి పైగా ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. రైలు నిలిచిపోయిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డిఆర్ఎఫ్ బృందం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సిటీ పోలీసులుస్పాట్కు చేరుకుని ప్రయాణికులకు బిస్కెట్లు, నీటిని అందిస్తున్నారు. మరోవైపు ఈ మార్గంలో రైళ రాకపోకలను నిలిపివేశారు. బద్లాపూర్ - కర్జాత్ / ఖోపోలి మధ్య రైలు సేవలను రద్దు చేశామని రైల్వే శాఖ ట్వీట్ చేసింది. "కుర్లా-థానే బెల్ట్ లో చాలా భారీ వర్షాలు రానున్నాయనీ, ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని చీఫ్పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ట్వీట్ చేశారు. ప్రయాణీకులను విమానం ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్నాయన్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా శనివారం ముంబై అంతర్జాతీయవిమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించని కారణంగా11 విమానాలను రద్దు చేయగా, తొమ్మిందింటిని దారి మళ్లించారు. #Maharashtra: Several places water-logged, after Waldhuni river overflows following heavy rainfall in the area. Visuals from Kalyan area. #MumbaiRains pic.twitter.com/loaP8mylnr — ANI (@ANI) July 27, 2019 Brijesh Singh, Directorate General of Information and Public Relations (DGIPR), Maharashtra: Three boats for rescue have reached the spot where Mahalaxmi Express is held up between Badlapur and Wangani with around 2000 passengers. https://t.co/pdnk9SJJHw — ANI (@ANI) July 27, 2019 -
సీట్లు లేవు : ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం
సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను నిరాకరించడంతో టెర్మినల్ 3వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. #Delhi: Over 20 passengers travelling on Air India Delhi-Guwahati flight today were denied boarding passes as the flight was overbooked, claims passengers. pic.twitter.com/dAvlZMZ2B7 — ANI (@ANI) June 5, 2019 -
సర్వర్ డౌన్ : ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిన ప్రయాణీకులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.20 గంటల ప్రాంతంలో ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్ 40 నిమిషాల పాటు నిలిచిపోయింది. సర్వర్ సమస్యతో ఇమిగ్రేషన్ చెక్ కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. సర్వర్ సమస్యపై ఎయిర్‌పోర్ట్‌లో బహిరంగ ప్రకటన చేయడంతో పాటు విమానాశ్రయ సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియను చేపట్టారని కొందరు ప్రయాణీకులు వెల్లడించారు. మరికొందరు ప్రయాణీకులు ఇమిగ్రేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొందని ట్విటర్లో ఫిర్యాదు చేయగా, విమానాశ్రయంలో పొడవాటి క్యూలను చూపే ఫోటోలను ట్వీట్ చేశారు. కాగా ఎయిర్ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ ఇటీవల ఐదు గంటల పాటు మొరాయించిన కొద్దిరోజులకే ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోని ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం గమనార్హం. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం పట్ల అధికారుల తీరుపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. -
రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
మంచిర్యాలక్రైం: కాజీపేట బల్లార్షాల మధ్య రైల్వేలైన్ల మరమ్మతు కారణంగా మంగళవారం, బుధవారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారం ప్రయాణికులకు తెలియకపోవడంతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మంగళవారం వచ్చిన వారంతా ఇబ్బందులుపడ్డారు. రైళ్ల రద్దు దృష్ట్యా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, వరంగల్ ప్రయాణికులకోసం అదనపు బస్సులు నడపకపోవడంపై జనం మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్, కాజిపేట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వేస్టేషన్ వరకు వచ్చి నానాతంటాలుపడ్డారు. నాగ్‌పూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్లోనే హోటళ్ల నుంచి భోజనం తెప్పించుకొని వేచి ఉండాల్సి వచ్చింది. రద్దయిన రైళ్లు... కాజిపేట్, బల్లార్షాల మధ్య చేపట్టిన రైల్వేలైన్ల మరమ్మతులో భాగంగా మంగళ, బుధవారం రెండురోజులపాటు కాజీపేట నుంచి బల్లార్షాలమధ్య నడిచే రామగిరి ప్యాసింజర్‌ను రద్దుచేశారు. భద్రాచలంరోడ్డు, బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్‌ను, భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య నడుపుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట వరకే నడుపుతున్నారు. కాజీపేట నుంచి నాగ్‌పూర్ మధ్య నడిచే అజ్నీ నాగ్‌పూర్ ప్యాసింజర్‌ను రామగుండం వరకే నడిపిస్తున్నారు. మంచిర్యాల నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రెండురోజులపాటు ఇంటర్సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, నాగ్‌పూర్ అజ్నీ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఒకేఒక్క రైలు... కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఒకేఒక్క కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులందరూ సాయంత్రం వర కు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో పడిగాపులు కా యాల్సి వచ్చింది. నాగ్‌పూర్ వైపు, హైదరాబాద్ వైపు వెళ్లే మిగతా రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి అనుకూలమైన రైళ్లు ప్రధానంగా రద్దుకావడంతో జిల్లాలో జన్నారం, కోటపెల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ప్రయాణికులతో రైలు నిండింది. అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా.. రైళ్లు రద్దు కావడంతో అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా. వరంగల్‌లో మా అన్నయ్యది పెళ్లి ఉంది. మా అమ్మనాన్నలు అందరూ వెళ్లారు. నేను తమ్ముడు ఇద్దరం ఈ రోజు ఇంటర్సిటీకి వెల్దామని ఆగినం. నీల్వాయి నుంచి సుమారు 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. రైళ్లు రద్దు అయ్యాయని చె ప్పారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సరిపడా డబ్బు లేదు. – రవళి, నీల్వాయి -
బస్టాండులో తలదాచుకుంటున్నారు..
చెన్నై : ఎడతెగని వర్షాలు, వరదలతో చెన్నై వాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీవిని ఎరుగని విపత్తు చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నది. భారీ వర్షాలతో చెన్నై జలరాకాసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. చెన్నై మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అనేకమంది కోయంబేడు బస్టాండ్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో వారు బస్టాండ్‌లోనే తల దాచుకుంటున్నారు. దొరికిన కాస్త జాగాలోనే సర్దుకుంటున్నారు. సెల్ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. మరోవైపు తమ క్షేమ సమాచారాలు తెలిపేందుకు కాయిన్ బాక్స్ ల దగ్గర బారులు తీరారు. -
గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. సాంకేతి లోపంతో ఎయిర్ కోస్టాకి చెందిన విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు మూడు గంటల పాటు విమానంలోనే ఖాళీగా కూర్చొని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆగ్రహించిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ అధికారులకు సర్వీస్ నిలిచిపోయిందని తెలియజేసి, ఫిర్యాదు చేశారు.