
సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను నిరాకరించడంతో టెర్మినల్ 3వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
#Delhi: Over 20 passengers travelling on Air India Delhi-Guwahati flight today were denied boarding passes as the flight was overbooked, claims passengers. pic.twitter.com/dAvlZMZ2B7
— ANI (@ANI) June 5, 2019