igi airport delhi
-
సీట్లు లేవు : ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం
సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను నిరాకరించడంతో టెర్మినల్ 3వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. #Delhi: Over 20 passengers travelling on Air India Delhi-Guwahati flight today were denied boarding passes as the flight was overbooked, claims passengers. pic.twitter.com/dAvlZMZ2B7 — ANI (@ANI) June 5, 2019 -
లేడీస్ వాష్‌రూంలో 3 కేజీల బంగారం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలోని వాష్ రూమ్‌లో 3 కేజీల బంగారం దొరికింది. సీఐఎస్ఎఫ్ బలగాలు జరిపిన సోదాల్లో మహిళల వాష్‌రూంలో రూ. 90 లక్షల విలువ గల బంగారం దొరికినట్లు అధికారులు చెప్పారు. బాంబు ఉందనే సమాచారంతో విమనాశ్రయంలో సోదాలు చేపట్టిన సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యురిటీ ఫోర్స్) బలగాలు బాంబు స్వ్కౌడ్‌ను రంగంలోకి దింపాయి. అయితే గాలింపులు చేస్తుండగా అందరూ విస్తుపోయేలా లేడిస్ వాష్‌రూంలో బాంబుకు బదులు బంగారం దొరికింది. తెల్లని పేపర్ టేప్‌లో చుట్టి ఉన్న ఓ ప్యాకెట్లో 3 కిలోల బరువున్న 3 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక కిలో ఉంది. ఆ బంగారం ఎవరిది ? దానిని ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. అయితే కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించి బంగారం వారికి అప్పగించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. -
విమానాశ్రయంలో చెంపదెబ్బలు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగుచూస్తుండటం తెలిసిందే. ఇండిగో సంస్థ సిబ్బంది అయితే ఓ ప్రయాణికుడిని రన్‌వేపైనే కిందపడేసి కొట్టారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ వివాదాస్పద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ప్రయాణికురాలు, ఎయిరిండియా విమానయాన సంస్థ అధికారిణి ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ–109 నంబర్ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ టికెట్ బుక్ చేసుకున్నారు. చెక్–ఇన్ కౌంటర్ వద్దకు నిర్దేశిత సమయం కన్నా 35 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ప్రయాణికురాలిని విమానమెక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో గొడవ మొదలైంది. ఎయిరిండియా నిబంధనల ప్రకారం దేశీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి కనీసం గంటంబావు ముందే చెక్–ఇన్ కౌంటర్ వద్దకు చేరుకోవాలి. కానీ సదరు ప్రయాణికురాలు కేవలం 40 నిమిషాలు ముందుగా వచ్చారు. దీంతో కౌంటర్లోని సిబ్బంది ఆమెను విమానమెక్కేందుకు అనుమతించకపోవడంతో ప్రయాణికురాలు వారితో వాదనకు దిగారు. దీంతో ఎయిరిండియా డ్యూటీ మేనేజర్‌గా ఉన్న అధికారిణి వద్దకు ప్రయాణికురాలిని సిబ్బంది పంపారు. అక్కడ వారిద్దరి మధ్య వాదనలు తీవ్రస్థాయికి చేరాయి. ఓ దశలో సంయమనం కోల్పోయిన ప్రయాణికురాలు అధికారిణిపై చేయిచేసుకున్నారు. వెంటనే అధికారిణి కూడా ప్రయణికురాలి చెంప చెల్లుమనిపించారు. తర్వాత వారిద్దరూ పరస్పరం క్షమాపణలు చెప్పుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారని పోలీసులు చెప్పారు. -
100 కిలోల బంగారం.. కొట్టేశాడా?
సాధారణంగా విదేశాల నుంచి బంగారం అక్రమంగా తీసుకొచ్చినప్పుడు దాన్ని పట్టుకునే కస్టమ్స్ అధికారులు ఆ బంగారం అంతటినీ భద్రంగా ఉంచుతారు. కానీ, అక్కడక్కడ అవినీతిపరులు మాత్రం అందులో కూడా తమ చేతివాటం చూపిస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. అక్కడ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో పట్టుకున్న దాంట్లో దాదాపు వంద కిలోల బంగారం కనిపించకుండా పోయింది. ఒకటీ అరా కాకుండా ఏకంగా వంద కిలోల బంగారం కనిపించకపోవడంతో ఉన్నతాధికారుల్లో కలవరం మొదలైంది. దాంతో ఏం జరిగిందా అని ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన సీబీఐ.. ఇది ఇంటిదొంగల పనే తప్ప బయటి వాళ్లది కాదని ప్రాథమికంగా తేల్చింది. బంగారం మిస్సయిన కేసులో ఒక సీనియర్ కస్టమ్స్ అధికారిని అరెస్టు చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం కనిపించకుండా పోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు జనవరిలో కూడా దాదాపు రూ. 2 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారం కనిపించకపోవడంతో అప్పుడు కూడా దానిపై సీబీఐ కేసు నమోదు చేసింది.