boarding passes
-
సీట్లు లేవు : ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం
సాక్షి,న్యూఢిల్లీ :ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను నిరాకరించడంతో టెర్మినల్ 3వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానంలో సీట్లు లేవు.. ఖాళీ లేదు అంటూ ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నవారికి చుక్కలు చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ-గౌహతి ఎయిరిండియా విమానంలో ప్రయాణిచేందుకు 20 మంది టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే వీరికి ప్రయాణానికి అవసరమైన బోర్డింగ్ పాస్‌లను ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. #Delhi: Over 20 passengers travelling on Air India Delhi-Guwahati flight today were denied boarding passes as the flight was overbooked, claims passengers. pic.twitter.com/dAvlZMZ2B7 — ANI (@ANI) June 5, 2019 -
ప్రధాని ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లు రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వరంగ ఎయిరిండియా ప్రకటించింది. ఎన్నికల వేళ ప్రధానితోపాటు గుజరాత్ సీఎం ఫొటోలుండటంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నేతల ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లపై పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ట్విట్టర్లో అభ్యంతరం తెలిపారు. ‘ఈ రోజూ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా జారీ చేసిన బోర్డింగ్ పాస్‌పై వైబ్రంట్ గుజరాత్ నినాదంతోపాటు ప్రధాని, గుజరాత్ సీఎం ఫొటోలున్నాయి. ఎన్నికల సమయంలో ఇటువంటి వాటిని చూడలేని, వినలేని, మాట్లాడలేని ఎన్నికల సంఘంపై ప్రజాధనం వృథాగా ఖర్చు చేయడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ బోర్డింగ్ పాస్ ఫొటోను జత చేశారు. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ స్పందిస్తూ ‘ప్రధాని మోదీ, గుజరాత్ సీఎంల ఫొటోలతో ఉన్న బోర్డింగ్ పాస్‌లను వెనక్కి తీసుకోవాలని మా సంస్థ నిర్ణయించింది. ఆ పాస్‌లను జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సమిట్ సందర్భంగా జారీ చేయగా మిగిలిపోయినవి అని భావిస్తున్నాం. వేరే సంస్థ వ్యాపార ప్రకటనలో భాగంగా వాటిని ఆవిధంగా ముద్రించి గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నాం. వాటి జారీని కొనసాగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తేలితే వెనక్కి తీసుకుంటాం’ అని వివరించారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిపారు. -
27 గంటలు ఆన్ లైన్ సేవలు బంద్!
బెంగళూరు: ఎయిర్ ఏషియా తన ఆన్ లైన్ సర్వీసులను జూన్ 21న నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. మెయింటనెన్స్ కారణాల వల్ల జూన్ 20 న అర్ధరాత్రి 12 గంటల(జూన్ 21న) నుంచి జూన్ 22 ఉదయం 3 గంటల వరకు ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇన్, మేనేజ్ మై బుకింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. మలేషియాకు చెందిన ఎయిర్ లైన్స్ ఎయిర్ ఏషియా టాటా సన్స్ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు భారత్ లోని 7 నగరాలకు విమాన సేవల్ని అందిస్తుంది. ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్న సమయంలో జర్నీ చేసే ప్రయాణికులు అంతకంటే ముందుగానే చెక్ ఇన్ ఆన్లైన్, మేనేజ్ మై బుకింగ్స్ చేసుకుని.. ఆ వివరాలతో బోర్డింగ్ పాసెస్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలని సంస్థ సూచించింది. ఎయిర్ లైన్స్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగదని, కేవలం ఆన్ లైన్ సేవలు మాత్రమే 27 గంటలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.