27 గంటలు ఆన్ లైన్ సేవలు బంద్!
బెంగళూరు: ఎయిర్ ఏషియా తన ఆన్ లైన్ సర్వీసులను జూన్ 21న నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. మెయింటనెన్స్ కారణాల వల్ల జూన్ 20 న అర్ధరాత్రి 12 గంటల(జూన్ 21న) నుంచి జూన్ 22 ఉదయం 3 గంటల వరకు ఆన్ లైన్ సేవలు నిలిపివేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇన్, మేనేజ్ మై బుకింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. మలేషియాకు చెందిన ఎయిర్ లైన్స్ ఎయిర్ ఏషియా టాటా సన్స్ సంస్థతో కలిసి నిర్వహిస్తోంది.
సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు భారత్ లోని 7 నగరాలకు విమాన సేవల్ని అందిస్తుంది. ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్న సమయంలో జర్నీ చేసే ప్రయాణికులు అంతకంటే ముందుగానే చెక్ ఇన్ ఆన్లైన్, మేనేజ్ మై బుకింగ్స్ చేసుకుని.. ఆ వివరాలతో బోర్డింగ్ పాసెస్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలని సంస్థ సూచించింది. ఎయిర్ లైన్స్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగదని, కేవలం ఆన్ లైన్ సేవలు మాత్రమే 27 గంటలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.