AirAsia Offering 50 Lakh FREE Seats, Here is How You Can Get - Sakshi
Sakshi News home page

AirAsia: బంపర్‌ ఆఫర్‌, ఏకంగా 50 లక్షల టికెట్లు ఫ్రీ

Published Tue, Sep 20 2022 2:12 PM | Last Updated on Tue, Sep 20 2022 2:47 PM

AirAsia offering 50 lakh FREE seats how you can get - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఏసియా విమాన ప్రయాణీకులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో  ఏకం50 లక్షల  ఉచిత  విమాన టికెట్లను అందిస్తోంది.  ఈమేరకు కంపెనీ ట్విటర్‌లో వివరాలను అందించింది

కస్టమర్‌లు సెప్టెంబర్ 25 వరకు  ఈ ఆఫర్‌లతో టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.  ఇలా  కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్‌ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్.  తమ వెబ్‌సైట్, మొబైల్ఆప్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్‌సైట్‌లో, ఈ ఆఫర్‌ను యాక్సెస్  కోసం "Flights" చిహ్నాన్ని ఎంచుకోవాలని తెలిపారు.

అంతర్జాతీయంగా విమాన  సేవలు క్రమంగా పునఃప్రారంభించడంతో పాటు,  సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్నఈ  బిగ్ సేల్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్‌ కోరారు. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల  ప్రయాణికులు ఆఫర్‌కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్‌ఏషియా కస్టమర్లకు ఉచిత  టికెట్లను అందించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement