AirAsia tickets
-
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్, 50లక్షల టికెట్లు ఉచితంగా
సాక్షి,ముంబై: ప్రముఖ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా విమాన ప్రయాణీకులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఏకం50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈమేరకు కంపెనీ ట్విటర్లో వివరాలను అందించింది కస్టమర్లు సెప్టెంబర్ 25 వరకు ఈ ఆఫర్లతో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్. తమ వెబ్సైట్, మొబైల్ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్సైట్లో, ఈ ఆఫర్‌ను యాక్సెస్ కోసం "Flights" చిహ్నాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అంతర్జాతీయంగా విమాన సేవలు క్రమంగా పునఃప్రారంభించడంతో పాటు, సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్నఈ బిగ్ సేల్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల ప్రయాణికులు ఆఫర్‌కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్ఏషియా కస్టమర్లకు ఉచిత టికెట్లను అందించిన సంగతి తెలిసిందే. AirAsia's BIG Sale is back! Enjoy 5 Million FREE Seats* starting today until 25 September 🥳 **Domestic: All-in from RM23, Asean: All-in from RM54. *Includes airport taxes, MAVCOM fee, fuel surcharges and other applicable fees. T&C apply. Read more: https://t.co/Pe2kRcZC7L — airasia Super App (@airasia) September 19, 2022 -
విశాఖ-కౌలాలంపూర్ టిక్కెట్ రూ.3,399!
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ స్థానిక నగరాల నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కేవలం రూ.3,399కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 15 వరకు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ఏషియా ప్రకటించిన ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల సేల్ ప్రయాణ కాలం 2019 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమై 2019 ఆగస్టు 13 వరకు ముగియనుందని ఎయిర్ఏషియా.కామ్‌లో వెల్లడించింది. న్యూఢిల్లీ, అమృత్సర్, జైపూర్ వంటి నగరాల నుంచి వీటి విమానాలు బయలుదేరతాయి. కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, ఆక్లాండ్ వంటి దేశాలకు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఎంబార్గో కాలాల్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు. తక్కువ ధరకే ఎయిర్ఏషియా విమాన టిక్కెట్ ఆఫర్.. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా తన సేల్ కింద అత్యంత తక్కువగా రూ.3,999కే అందిస్తోంది. క్రెడిట, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపే వాటికి నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ధరలోనే ఎయిర్‌పోర్టు పన్నులు కలిసి ఉంటాయి. అయితే డిపార్ట్చర్ సమయంలో సేకరించే ఎయిర్‌పోర్టు పన్నులు దీనిలో ఉండవు. సీట్లు కూడా పరిమితమే. అన్ని ఎయిర్ఏషియా విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ సేల్ కింద అమృత్సర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే విమాన టిక్కెట్‌ను రూ.4,490కు అందిస్తుంది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్‌కు, సింగపూర్‌కు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.6,436కు ప్రారంభమవుతుంది. కోల్‌కతా నుంచి కౌలాలంపూర్, పెర్త్లకు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.11,355 నుంచి ఉంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు రూ.3,497, న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్, బ్యాండంగ్కు రూ.8,730, బెంగళూరు నుంచి కౌలాలంపూర్, మెల్బోర్న్కు రూ.14,999కు విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా విక్రయిస్తోంది. -
ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంబించింది. స్పెషల్ ప్రమోషన్ పథకం కింద ఎయిర్ ఏసియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే పేరెంట్ కంపెనీ ఏయిర్ ఏసియా కూడా అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బేస్ ఛార్జీలపై 20శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సదుపాయం ఫిబ్రవరి 25తో ముగియనుంది. దీంతోపాటు మొబిక్విక్ ద్వారా చేసిన కొనుగోళ్లపై మరో 15శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. బెంగళూరు, న్యూ ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం తదితర దేశీయ మార్గాల్లో టికెట్లకు ఈ రేట్లు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో, వైమానిక సంస్థ విమానాలు కౌలాలంపూర్, ఆక్లాండ్, బ్యాంకాక్ తదితర అనేక విమానాల టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ అధికారిక వెబ్సైట్ airasia.com లో తెలిపింది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ కాలం 2018 ఫిబ్రవరి 25నుంచి ప్రారంభమై 28తో ముగుస్తుంది. విదేశీ మార్గాల్లో అయితే మార్చి 25న మొదలై జూలై 31, 2018 తో ముగుస్తుంది. అయితే కొన్ని విదేశీ మార్గాల్లో ప్రయాణ కాలానికి సంబంధించిన వివరాలో అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
విమాన టిక్కెట్‌పై జియో డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్ధమైందట. ఏయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు చేసింది. ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను వినియోగదారుల సద్వినియోగం చేసుకోవచ్చని, 2017 జూన్ 20 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో ఇది వర్తిస్తుందని నివేదించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆఫర్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు పేర్కొంది. ఈ విమానయాన సంస్థ మొదట ఈ ఆఫర్ గురించి ఓ ట్వీట్ చేసింది. అనంతరం వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ప్రత్యర్థ కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ(ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను టార్గెట్ చేసుకుని జియో ఈ వ్యూహాన్ని అమల్లోకి తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.