విమాన టిక్కెట్పై జియో డిస్కౌంట్ ఆఫర్
విమాన టిక్కెట్పై జియో డిస్కౌంట్ ఆఫర్
Published Tue, Apr 18 2017 2:22 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్ధమైందట. ఏయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. ఏయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ను వినియోగదారుల సద్వినియోగం చేసుకోవచ్చని, 2017 జూన్ 20 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో ఇది వర్తిస్తుందని నివేదించింది.
వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈ ఆఫర్ను లాంచ్ చేయబోతున్నట్టు ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టు పేర్కొంది. ఈ విమానయాన సంస్థ మొదట ఈ ఆఫర్ గురించి ఓ ట్వీట్ చేసింది. అనంతరం వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ప్రత్యర్థ కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ(ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను టార్గెట్ చేసుకుని జియో ఈ వ్యూహాన్ని అమల్లోకి తెస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
Advertisement