
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న కారు, బైక్ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహ్మద్ తాజుద్దీస్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడి మృతి చెందారు. మృతుడు నగరంలో ఓ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.