హైదరాబాద్లోని పంజాగుట్ట మోనో హోటల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకై పేలుడు సంభవించడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు.
హైదరాబాద్లోని పంజాగుట్ట మోనో హోటల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీకై పేలుడు సంభవించడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. గాయాలపాలయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది ఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. హోటల్లోని వంటగది మొత్తం విడివిడి వస్తువులుగా చిందరవందరగా మారి పూర్తిగా దెబ్బతిన్నది.