
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహ్మద్ అన్వర్ అనే డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రియాసత్ అలీ అనే వ్యక్తి మహ్మద్ అన్వర్‌పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అన్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రియసత్ అలీని అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.