
పంజాగుట్టలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
పంజాగుట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్: పంజాగుట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లిహిల్స్ చెక్పోస్టు, బంజారాహిల్స్ నుంచి కిలోమీటర్ పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి అటు వాహనదారులు, ఇటు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.