మందు బాబు, పోలీసుల స్ట్రీట్‌ఫైట్
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మోతాదుకు మించి మద్యం సేవించిన ఓ యువకుడు హల్ చల్ చేసాడు. తాగడమే కాకుండా కారు సీజ్ చేసినందుకు అతగాడు ట్రాఫిక్ పోలీసులపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే... వాహనాల తనిఖీల్లో భాగంగా దినేష్ పటేల్ అనే యువకుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 194 ఆల్కహాలు పర్సంటేజ్ రావడంతో కేసు బుక్ చేశారు. అయితే తన వాహనాన్ని సీజ్ చేయడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై దాడి చేశారు.
దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఆ మందుబాబుపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ ...యువకుడితో పాటు, కానిస్టేబుల్స్‌ను వారించి ...మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇక నగరంలో మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతూ 40 మంది పోలీసులకు చిక్కారు. 20 కార్లు, 25 బైకులను సీజ్ చేశారు పోలీసులు..పట్టుబడిన వారందరినీ కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.