
పెళ్లి రద్దుతో యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: వివాహం రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం .. నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ (38) సోమాజిగూడ క్రాంతిశిఖరా అపార్ట్‌మెంట్ 3వ అంతస్తులో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ వీడియో ఎడిటింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం ఇతనికి పెళ్లి కుదిరింది. పేరు బలాలు కుదరకపోవడంతో వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని పెళ్లికూతురు తరఫువారు ఇటీవల ఫోన్ చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.