
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్స్‌కు ఏర్పాటు చేసిన డెకరేషన్స్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. నల్లని పొగ కమ్మేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. అగ్నిప్రమాదంతో పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది.
చదవండి : (పెళ్లి విషయం దాచిపెట్టి ప్రేమ నాటకం.. దాంతో)
('అమృత్ మహోత్సవ్'కు ప్రధాని మోదీ శ్రీకారం)
Comments
Please login to add a commentAdd a comment