టార్గెట్‌ ఠాణా | JKBH Terrorists Target on Hyderabad Police stations | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ ఠాణా

Published Fri, Jan 20 2017 1:24 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

టార్గెట్‌ ఠాణా - Sakshi

టార్గెట్‌ ఠాణా

పంజగుట్ట, అఫ్జల్‌గంజ్, బహదూర్‌పురనే లక్ష్యం
జేకేబీహెచ్‌ ఉగ్రవాదులు టార్గెట్‌ చేసిన ఠాణాలు ఇవే


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘ఐసిస్‌’అనుబంధ సంస్థ ‘జుందుల్‌ ఖిలాఫ్‌ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌(జేకేబీహెచ్‌)’ఉగ్రవాదులు నగరంలోని పంజగుట్ట, అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్లను టార్గెట్‌ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిర్థారించారు. దీనికి సంబంధించి ఓ ఉగ్రవాది హైటెక్‌ పద్ధతిలో రెక్కీ సైతం నిర్వహించినట్లు కీలకాధారాలు సేకరించిన అధికారులు.. అభియోగపత్రాల ద్వారా నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జేకేబీహెచ్‌ ఉగ్రవాదులనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు గత ఏడాది జూన్, జూలైలో పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్‌ అథవుర్‌ రెహ్మాన్, అబ్దుల్‌ బిన్‌ అహమద్‌ అల్‌మౌదీ అలియాస్‌ ఫహద్, హబీబ్‌ మహ్మద్, ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్‌లను, మంగళవారం మహ్మద్‌ ఇర్ఫాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


జీపీఎస్‌ ఆధారంగా రెక్కీ: ఉగ్రవాదులు సహా ముష్కరమూకలు ఎవరైనా ప్రముఖులు, ఏదైనా ప్రాంతాన్ని టార్గెట్‌ చేసినప్పుడు పక్కాగా రెక్కీ నిర్వహి స్తారు. దాడి చేయడానికి ముందు ఆ ప్రాంతానికి సంబం« దించిన భౌగోళిక పరిస్థితులు, వ్యక్తుల కదలికలు తెలుసు కోవడానికి ఇలా చేస్తుంటారు. సాధారణంగా ఈ రెక్కీలో పాల్గొన్న ముష్కరులే ఆపరేషన్‌లోనూ ఉండాల్సి ఉంటుం ది. రెక్కీతో ఆ ప్రాంతం/వ్యక్తిపై వారికే పూర్తి అవగాహన ఉండే నేపథ్యంలో ఇది కచ్చితం. అయితే సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఐసిస్‌ భారత చీఫ్‌ షఫీ ఆర్మర్‌ ఆదేశాల మేరకు పని చేస్తున్న జేకేబీహెచ్‌ మాడ్యుల్‌ మాత్రం హైటెక్‌ పద్ధతిలో రెక్కీ నిర్వహించింది. మూడు పోలీసుస్టేషన్ల వద్దా రెక్కీ చేసే బాధ్యతల్ని ఈ మాడ్యుల్‌ ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్‌కు అప్పగించింది. ఆధునిక పం«థాలో ఈ పని చేసిన ఇతగాడు ఆయా పోలీసుస్టేషన్లకు సంబంధించిన జీపీఎస్‌ కోఆడినేట్స్‌ (అక్షాంశ, రేఖాంశ వివరాలు) తన సెల్‌ఫోన్‌లో మ్యాప్‌పై నిక్షిప్తం చేసుకున్నాడు. ఇలా చేయడంతో విధ్వంసం సృష్టించాల్సిన రోజు ఇతడు ఆ గ్యాంగ్‌లో ఉన్నా, లేకపోయినా తన సెల్‌ఫోన్‌లో సమాచారం షేర్‌ చేస్తే సరిపోతుంది. ఈ కోఆడినేట్స్‌తో నావిగేటర్‌ వినియోగించి కొత్త వ్యక్తులు సైతం దాడులు చేసే అవకాశం ఉంటుందనే ఇలా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రిజ్వాన్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు ఈ కోఆడినేట్స్‌తో కూడిన మ్యాప్‌ను గుర్తించారు.

మెషిన్‌గన్స్‌ కోసం ప్రయత్నించారా..?
ఈ ఉగ్రవాదులు పోలీసుస్టేషన్లతో పాటు పోలీసులు, ప్రముఖుల్నీ టార్గెట్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విధ్వంసాలు సృష్టించడానికి పేలుడు పదార్థాలు, ఎంపిక చేసుకున్న వ్యక్తుల్ని కాల్చి చంపడానికి తుపాకులు, తూటాలు సంగ్రహించే ప్రయత్నాలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఠాణాల వద్ద రెక్కీ పూర్తయినా.. వ్యక్తుల ఎంపికకు సంబంధించి షఫీ ఆర్మర్‌ నుంచి ఆదేశాలు రాని నేపథ్యంలోనే ఆ కుట్ర అమల్లోకి రాలేదని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఇబ్రహీం యజ్దానీ ఆదేశాల మేరకు ముష్కరులు నల్లగొండ జిల్లా పోచంపల్లి నుంచి యూరియా సహా ఇతర పేలుడు పదార్థాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కూడా వెళ్లొచ్చారు. ఉగ్రవాది హబీబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో పేలుడు పదార్థాలతో పాటు 17 తూటాలు ఉన్నాయి. ఇవి సాధారణ పిస్టల్‌తో పాటు సబ్‌–మెషిన్‌గన్‌లోనూ వాడేవని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ముష్కరులు వ్యక్తుల్ని టార్గెట్‌ చేయడం కోసం సబ్‌–మెషిన్‌గన్స్‌ సేకరించే ప్రయత్నాలు చేసినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మంగళవారం అరెస్టు చేసిన ఇర్ఫాన్‌ను కస్టడీకి తీసుకోనున్నారు.

మ్యాప్‌లో స్పష్టంగా మార్కింగ్‌..
జేకేబీహెచ్‌ మాడ్యుల్‌లో కీలక పాత్ర పోషించిన ఇబ్ర హీం యజ్దానీ ఆదేశాల ప్రకారం తాను మూడు పోలీసు స్టేషన్ల వద్ద హైటెక్‌ రెక్కీ నిర్వహించినట్లు రిజ్వాన్‌ అంగీ కరించాడు. ఇతడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ లాబ్‌లో విశ్లేషిం చిన ఎన్‌ఐఏ అధికారులు అందులో జీపీఎస్‌ కోఆడినేట్స్‌ తో కూడిన మ్యాప్‌ను సంగ్రహించి, అధ్యయనం చేశారు. ఆ మ్యాప్‌లో నెహ్రూ జులాజికల్‌ పార్క్, సాలార్జంగ్‌ మ్యూజియం, ఖైరతాబాద్‌–అమీర్‌పేట మధ్య మార్కిం గ్స్‌ ఉండటాన్ని గుర్తించారు. వీటి ఆధారంగానే బహదూ ర్‌పుర, అఫ్జల్‌గంజ్, పంజగుట్ట ఠాణాలే హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు నిర్థారించారు. ఎన్‌ఐఏ అధికారుల విచారణలో రిజ్వాన్‌ సైతం ఇదే అంశాన్ని బయటపెట్టడం గమనార్హం. ఈ మాడ్యుల్‌ ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల నుంచి దర్యాప్తు అధికారులు కీలక ఫొటోలు, సాకేంతిక ఆధారాలు సేకరించగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement