అక్రమ సంబంధం అంటగట్టాడని... | wife kills Husband in panjagutta | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం అంటగట్టాడని...

Published Fri, Jul 1 2016 10:07 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

wife kills Husband in panjagutta

వేరొకరితో సంబంధం అంటగట్టిన భర్తను ఓ భార్య అంతం చేసింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పంజగుట్ట: వేరొకరితో సంబంధం అంటగట్టిన భర్తను ఓ భార్య అంతం చేసింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండలోని ఇందిరానగర్‌లో అశోక్, భీమమ్మ నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన అశోక్ పనీపాటా లేకుండా తిరుగుతుండేవాడు. ఇళ్లలో పనులు చేసే భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో భీమమ్మ సొంతూరైన మహబూబ్‌నగర్ జిల్లాకు కొన్ని రోజులు పిల్లలతో సహా వెళ్లింది. ఇటీవలే ఆమె తిరిగొచ్చింది.

ఈ క్రమంలో ఆమెకు బంధువుతో అక్రమ సంబంధం ఉందంటూ అశోక్ వేధించసాగాడు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకున్న భీమమ్మ మే 7వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న అశోక్‌ను టవల్‌తో గొంతుకు బిగించి చంపింది. మితిమీరి మద్యం తాగినందునే అతడు చనిపోయాడని అందరినీ నమ్మించింది. అయితే, మృతుని సోదరుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భీమమ్మను విచారించగా నేరం అంగీకరించింది. ఈ మేరకు నిందితురాలిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement