
సాక్షి, పంజాగుట్ట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు దేశవ్యాప్తంగా పాలకులు అందరూ పాటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 71వ జయంతిని పురస్కరించుకుని పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. (నాలో... నాతో.. వైఎస్సార్)
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు, విద్యార్థులకు, మహిళలకు.. వైఎస్సార్ ఒక ల్యాండ్ మార్క్‌ను క్రియేట్ చేశారన్నారు. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు తాము విశేషంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కెవీపీ రామచంద్ర రావు, అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు నేతలు పాల్గొన్నారు. (తాడిపత్రిపై రాజన్న ముద్ర..)