'వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చేందుకు కృషి' | TPCC Leaders pay tributes to YSR at gandhi Bhavan | Sakshi
Sakshi News home page

'వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చేందుకు కృషి'

Published Wed, Jul 8 2015 11:55 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

TPCC Leaders pay tributes to YSR at gandhi Bhavan

హైదరాబాద్ : ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి పురస్కరించుకుని గాంధీభవన్లోని వైఎస్ చిత్రపటానికి ఉత్తమ్కుమార్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వైఎస్ఆర్ సీఎంగా ఉన్న హయాంలో ప్రజల కోసం చేపట్టిన సంక్షేమపథకాలను వివరించారు. వైఎస్ స్ఫూర్తితోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లతోపాటు కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement