T Cong mlc
-
నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..
కాంగ్రెస్ ఓటమికి పాల్వాయి వంటి నేతలే కారణం మండలి ప్రతిపక్ష నేత షబ్బిర్ అలీ హైదరాబాద్ : కాంగ్రెస్ ఓటమికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... సీఎల్పీ నేత జానారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను షబ్బీర్ అలీ ఖండించారు. జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన పాల్వాయికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, కూలీల వలసలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్‌ను సైతం కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తాము రెండేళ్లుగా చెబుతున్న అంశాలే జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ లేవనెత్తారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కోదండరాంను విమర్శించినందుకు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నాలుక కోస్తా అన్న కెసీఆర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రులు కోదండరాం పై చేసిన దాడిని ఏ విధంగా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు ఏ శిక్షలు విధిస్తారని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. ఈ అంశంపై కేసీఆర్ స్పందించకపోతే ఆయన ఆదేశాలతోనే మంత్రులు కోదండరామ్‌ను టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
'కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉంది'
హైదరాబాద్ : ముస్లింల 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండదన్న నిబంధనలకు లోబడే కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ దుర్బుద్దితో హామీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్‌ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
'వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చెప్పిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కోటి ఎకరాలలో నీరు అందించడం కాంగ్రెస్ చేపట్టిన 60 లక్షల ఎకరాల ప్రాజెక్టుల వల్లే అని చెప్పారు. పట్టిసీమ ఎలా కడతారని గతంలో ఆరోపించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనడం వెనక మతలబులేంటి అని అనుమానం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసు ఎమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై కేసీఆర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నా పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆక్షేపించిన సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం దారుణమని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. -
'ఖమ్మం జిల్లాను ప్రస్తావించకపోవడం అన్యాయం'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా సమస్యలను ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించకపోవడంపై టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... తమ జిల్లా సమస్యలను ప్రధాని వద్ద కేసీఆర్ ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలోని పలు గ్రామాలను ముంపునకు గురి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్న అంశాన్ని సైతం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. కరువు బాధిత మండలాలను ఆదుకోవడంలో కూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. -
'హైకోర్టు వ్యాఖ్యలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు'
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై హైకోర్టు వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు. రైతు ఆత్మహత్యలపై ఉన్నత కమిటీ వేసి... కారణాలు అన్వేషించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆదుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
నిర్బంధ తమిళం సరికాదు
ఎమ్మెల్సీ పొంగులేటి కొరుక్కుపేట: తెలుగు భాషపై తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించటం సరైన పద్ధతి కాదని తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాతృభాషను వదలి తమిళంలో చదవాలనే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదని దుయ్యబట్టారు. ఎన్నో దశాబ్దాలు తరబడి తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిని తక్కువ చేసి చూడడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమిళనాట తెలుగు భాషా సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తిపరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు. నిర్బంధ తమిళం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అల్పసంఖ్యాకుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కనీసం 10 సంవత్సరాలు పాటు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రంలోని మైనారిటీ భాషలన్నింటికీ ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. -
బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరువు దృష్ణ్యా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే కరువు సాయంపై దృష్టి సారించాలని కేసీఆర్‌కు సూచించారు. ప్రత్యేక హొదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చేందుకు కృషి'
హైదరాబాద్ : ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి పురస్కరించుకుని గాంధీభవన్‌లోని వైఎస్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సీఎంగా ఉన్న హయాంలో ప్రజల కోసం చేపట్టిన సంక్షేమపథకాలను వివరించారు. వైఎస్ స్ఫూర్తితోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లతోపాటు కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
బాబును తప్పించే ప్రయత్నాలు?
-
రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసును వేగవంతం చేయాలని సుధాకర్‌రెడ్డి... ప్రభుత్వానికి సూచించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పొంగులేటి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. -
'తెలంగాణ చరిత్ర కేసీఆర్ సొంత డబ్బాలా ఉంది'
హైదరాబాద్: ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర సీఎం కేసీఆర్ సొంత డబ్బాలా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విలేకర్లతో మాట్లాడారు. 10వ తరగతి సాంఘీక శాస్త్రంలోని పాఠ్యాంశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాశారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన సిద్ధాంత కర్త ప్రొ.జయశంకర్, ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న అమరవీరుల పేర్లు ప్రస్తావించలేదని ఆరోపించారు. భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్యపుస్తకాలున్నాయని విమర్శించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చట్టసభల్లో అంగీకరించారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గుర్తు చేశారు.