'తెలంగాణ చరిత్ర కేసీఆర్ సొంత డబ్బాలా ఉంది' | TPCC Chief Uttam kumar reddy with shabbir ali takes on Telangana CM KCR | Sakshi

'తెలంగాణ చరిత్ర కేసీఆర్ సొంత డబ్బాలా ఉంది'

May 27 2015 2:08 PM | Updated on Sep 19 2019 8:44 PM

ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర సీఎం కేసీఆర్ సొంత డబ్బాలా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

హైదరాబాద్: ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర సీఎం కేసీఆర్ సొంత డబ్బాలా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విలేకర్లతో మాట్లాడారు. 10వ తరగతి సాంఘీక శాస్త్రంలోని పాఠ్యాంశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాశారని చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన సిద్ధాంత కర్త ప్రొ.జయశంకర్, ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న అమరవీరుల పేర్లు ప్రస్తావించలేదని ఆరోపించారు. భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్యపుస్తకాలున్నాయని విమర్శించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చట్టసభల్లో అంగీకరించారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement