'వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు' | ponguleti sudhakar reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు'

Published Fri, Apr 1 2016 1:54 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు' - Sakshi

'వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు'

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చెప్పిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. కోటి ఎకరాలలో నీరు అందించడం కాంగ్రెస్ చేపట్టిన 60 లక్షల ఎకరాల ప్రాజెక్టుల వల్లే అని చెప్పారు. పట్టిసీమ ఎలా కడతారని గతంలో ఆరోపించిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనడం వెనక మతలబులేంటి అని అనుమానం వ్యక్తం చేశారు.

ఓటుకు కోట్లు కేసు ఎమైందని కేసీఆర్ ను ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై కేసీఆర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉన్నా పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆక్షేపించిన సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం దారుణమని సుధాకర్రెడ్డి ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement