
బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరువు దృష్ణ్యా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే కరువు సాయంపై దృష్టి సారించాలని కేసీఆర్కు సూచించారు.
ప్రత్యేక హొదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు.