రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు! | Ponguleti Sudhakar Reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

Published Sat, Jun 6 2015 1:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

రేవంత్ కేసులో బాబును తప్పించే ప్రయత్నాలు!

హైదరాబాద్: రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని ఏ1 ముద్దాయిగా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కేసు విచారణ నత్తనడకన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కేసును వేగవంతం చేయాలని సుధాకర్రెడ్డి... ప్రభుత్వానికి సూచించారు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పొంగులేటి కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement