హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై హైకోర్టు వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో అన్నారు. రైతు ఆత్మహత్యలపై ఉన్నత కమిటీ వేసి... కారణాలు అన్వేషించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆదుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.