హైదరాబాద్ : ముస్లింల 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండదన్న నిబంధనలకు లోబడే కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ దుర్బుద్దితో హామీ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్కు నిజాయితీ ఉంటే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.