వాట్సాప్ నంబర్‌ను విడుదల చేస్తున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు
పంజగుట్ట: పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, స్కూల్‌లో వేధింపులు, అత్యాచారాలు, కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 నంబరుకు వాట్సాప్ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్ స్కూల్ విద్యార్ధులతో కలిసి వాట్సాప్ నెంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో రేఖారాణి, నటరాజ్ భట్, వెంకటరమణ, సిరి చిన్మయి, సాయి చరిత, శరత్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.