ఆయనో స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ.. | Director Trivikram Srinivas Still Pays Room Rent For Panjagutta House | Sakshi
Sakshi News home page

Trivikram Srinivas: సొంతిల్లు ఉన్నా నేటికీ అద్దె ఇంట్లోనే..

Aug 30 2021 12:58 PM | Updated on Aug 30 2021 3:19 PM

Director Trivikram Srinivas Still Pays Room Rent For Panjagutta House - Sakshi

సినిమా ఇండస్ట్రీలో కథలు రాయడం, సినిమా రిలీజ్‌ సహా చాలా అంశాలు సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటాయి. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు కూడా ఓ సెంటిమెంట్‌ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్‌, డైరెక్టర్‌ దశరథ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్‌ ఎన్నో సినిమాలకు కథలు అందించారు.

స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి  సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్‌ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌ కొనసాగుతున్నారు. అయినా  తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్‌కు ఎంతో మమకారమట.

అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్‌గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్‌కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్‌గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. 

చదవండి : కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్
'మహమ్మద్‌ ఖయ్యుమ్‌'గా సునీల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement