అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ఇంట్లో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది.
అమీర్‌పేట (హైదరాబాద్) : అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ఇంట్లో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. దొంగలు పడి 4 తులాల బంగారు గొలుసు, 22 వేల రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు.
చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం గమనించిన శేషుకుమారి సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.