ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేట్‌లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్‌ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి.
(ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్)
ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్‌లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ.
Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8
— AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023
( ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! )
the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun
— AAA cinemas (@aaa_cinemas) June 15, 2023
Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C
Comments
Please login to add a commentAdd a comment