Satyam Theatre
-
అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేట్‌లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్‌ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ. Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8 — AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023 ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! ) the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C — AAA cinemas (@aaa_cinemas) June 15, 2023 -
సత్యం థియేటర్‌వైపు వెళ్లొద్దు..
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని సత్యం థియేటర్ మార్గంలో జీహెచ్ఎంసీ అధికారులు నాలా వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం నుంచి మూడు నెలల పాటు కనకదుర్గ దేవాలయం–సత్యం థియేటర్ మధ్య మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి. రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి కేవలం ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. మైత్రీవనం నుంచి గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్ళే ఈ వాహనాలను ధరమ్‌కరమ్ రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, సోనబాయ్ టెంపుల్, సత్యం థియేటర్ మీదుగా పంపించనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను అనుమతిస్తామని చెప్పారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని కోరారు. మలక్‌పేటలోనూ.. మలక్‌పేట ఆర్వోబి వద్ద మెట్రో వయాడక్ట్‌ల(సెగ్మెంట్ల) అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. వయాడక్ట్‌ల అనుసంధానం కోసం నాలుగు నెలల క్రితం ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీక్రేన్ సహాయంతో ఎల్జి బ్రిడ్జి బ్లిల్డర్ను పిల్లర్లపైకి ఎక్కించారు. మూడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి సెగ్మెంట్లను అనుసంధానం పూర్తిచేశారు. వయాడక్ట్‌ల అనుసంధానం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా బ్రిడ్జి బిల్డర్‌ను కిందకి దింపలేకపోవటం, మరోవైపు మెట్రో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మలక్‌పేటలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని డాక్టర్ వి. రవీందర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి నవంబర్ 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
ఇష్టపడటమే కాదు.. తోకలు కూడా తగిలిస్తున్నారు!
‘‘హైదరాబాద్‌లోని అమీర్‌పేట సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు, ‘ఈ సినిమా చేస్తే అదే సత్యం థియేటర్లో కూర్చొని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేస్తానా? లేదా?’ అని ఆలోచిస్తా. ఓ ప్రేక్షక్షుడిగా ఆలోచించి కథలు ఎంచుకుంటా’’ అని హీరో నాని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు... ఇందులో నా పాత్ర పేరు జై. కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. నా పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నా పాత్ర చూస్తే వీడు మంచా? చెడా? అన్నది తెలియదు. ఈ రెండు కోణాలకు చక్కటి ముగింపు ఉంటుంది. నేనింతకుముందు చేసిన చిత్రాలతో పోల్చితే కథాబలమున్న చిత్రమిది. అందుకే ప్రేమించి చేశా. వాస్తవానికి కథ విన్నప్పుడు ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. తెలుగు పరిశ్రమలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలెక్కువ. ఇవన్నీ ఉంటూనే, ఇందులో బలమైన కథ కూడా ఉంది. వదులుకుంటే మళ్లీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదనిపించి చేశా. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా? అని డిస్కస్ చేసుకునేవాళ్లం. శివలెంక కృష్ణప్రసాద్‌గారు ‘జెంటిల్మన్’ వంటి టైటిల్ పెడితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు అవసరాల శ్రీనివాస్‌ని ‘జెంటిల్మన్’ పదానికి తెలుగులో మరో పదం ఏదైనా ఉందా? అని అడిగితే, ‘జెంటిల్మన్’ అని ఎందుకు పెట్టకూడదని అన్నాడు. అందరికీ నచ్చింది. సినిమా చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు నాతో ‘అష్టా చమ్మా’ సినిమా తీస్తుంటే.. ‘వీళ్లు అమాయకుల్లా ఉన్నారు. నాతో సినిమా తీస్తున్నారు, ఎవరు చూస్తారులే’ అనుకున్నా. అంటే దర్శక- నిర్మాతలకు నాపై నమ్మకం ఉన్నా, నాపై నాకే నమ్మకం లేదు. ‘అష్టా చమ్మా’ చేసేసి, మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా వెళ్లిపోదాం అనుకున్నా. ఫ్యూచర్లో ఓ ఇరవై ఏళ్ల తర్వాత వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో చూసుకోవాలంటే ‘అష్టా చమ్మా’ డీవీడీ ఉంటుందనే ఆలోచనతో ఆ సినిమా చేశా. ఆ చిత్రం సక్సెస్ కావడంతో, ప్రేక్షకులు నన్ను కూడా ఇష్టపడుతున్నార నే నమ్మకం పెరిగింది. న్యాచురల్ స్టార్ అని తోకలు కూడా పెట్టేస్తున్నారు. ‘అష్టా చమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు ఓ మంచి రైటర్. ఆ తర్వాతే డెరైక్టర్. బట్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆయన అంతే మంచి రైటర్, అంతకుమించి మంచి డెరైక్టర్. టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికీ ఇప్పటికీ చాలా పెరిగింది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో అవసరాల శ్రీనివాస్ ఒకరు. ‘అష్టా చమ్మా’, ‘పిల్ల జమీందార్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత మేం కలిసి చేసిన సినిమా ఇదే. త్వరలో మేమిద్దరం మరో సినిమా చేయబోతున్నాం. శ్రీను చాలా మంచి నటుడు. తనకు తగ్గ పాత్ర ఇప్పటికీ దొరకలేదు. శివలెంక కృష్ణప్రసాద్గారంటే ముందు నాకు ఎవరో తెలియదు. మోహనకృష్ణ గారు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పారు. ఓ సందర్భంలో ‘ఆదిత్య 369’ చిత్రం గురించి చెప్పడంతో.. ఆ రోజుల్లోనే అంత రిచ్‌గా ఆ చిత్రం చేశారంటే... ఇప్పుడైతే ఇంకెంత బాగా తీస్తారో అనిపించింది. నాకు స్టయిలిష్‌గా కంటే సింపుల్‌గా ఉండటమే ఇష్టం. కానీ, మా ఇంట్లో వాళ్ల ప్రభావంతో నా పంథా మార్చుకుని ఇకపై చేసే చిత్రాల్లో స్టయిలిష్‌గా కనిపించాలని అనుకుంటున్నా. విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ నిర్మించే ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే చిత్రం చేస్తా.