హైదరాబాద్లోని అమీర్పేట వద్దగల ఓ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీ గల మైత్రీవనం ప్రాంతంలోని షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేట వద్దగల ఓ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీ గల మైత్రీవనం ప్రాంతంలోని షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో షాపింగ్ మాల్ సిబ్బంది, సమీపంలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.