
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్‌నెస్ కోసం గతేడాది కల్యాణ్‌నగర్‌లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్‌నెస్ సెంటర్‌లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది.
పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..)
Comments
Please login to add a commentAdd a comment