Anusri
-
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్‌ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్‌లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్నెస్ కోసం గతేడాది కల్యాణ్నగర్లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..) -
అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్‌ఫాదర్ ?
సాక్షి, కర్ణాటక: నిత్యం సంచలనాలు నమోదవుతున్న శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని అనుశ్రీ శుక్రవారం ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో కుమారస్వామి గళమెత్తారు. డ్రగ్స్ కేసులో అనుశ్రీకి ఒక మాజీ ముఖ్యమంత్రి సహాయహస్తం అందించినట్లు ప్రచారం జరుగుతోంది, ఆ మాజీ సీఎం ఎవరో బయట పెట్టాలని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శనివారం బెంగళూరులో డిమాండ్ చేశారు. అనుశ్రీకీ మాజీ సీఎం ఒకరు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆరుమంది మాజీ సీఎంలున్నారు. ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. డ్రగ్స్ కేసులో విస్తృతంగా దర్యాప్తు చేయాలన్నారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ఆ వీడియో నాటకం: సంబరగి అనుశ్రీ వీడియోపై సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి మండిపడ్డారు. అరెస్ట్ భయంతోనే ఆమె నాటకమాడుతున్నారని అన్నారు. ఆమె అరెస్ట్ కాకుండా ఒక గాడ్ ఫాదర్ రక్షించినట్లు ఆయన ఆరోపించారు. ఆమె చేసిన తప్పులకు శిక్షను అనుభవించక తప్పదన్నారు. సీసీబీ విచారణకు హాజరైనంత మాత్రాన తాను తప్పు చేసినట్లు కాదని అనుశ్రీ వ్యాఖ్యానించడంపై ఆక్షేపించారు. (నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన) డ్రగ్స్ కేసు చాలా పెద్దది: మంగళూరు సీపీ డ్రగ్స్ కేసు చాలా పెద్దదని మంగళూరు నగర పోలీసు కమిషనర్ (సీపీ) వికాస్కుమార్ చెప్పారు. ఆయన శనివారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నగర సీసీబీ సీఐ శివప్రకాశ్ నాయక్ బదిలీ వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఇప్పటివరకు సీసీబీపై రాజకీయ ఒత్తిడి లేదన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు చైన్ లింక్‌లా ఉంది, చివర ఎక్కడ అనేది కనిపించటం లేదని అన్నారు. మంగళూరులో ఇప్పటివరకు ఆరుమందిని అరెస్ట్ చేశామన్నారు. కాగా నటీమణి రాగిణి, సంజనలతో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన వీరేన్ఖన్నాపై బెంగళూరులో గతంలోనే 4 కేసులు నమోదైనట్లు తేలింది. కాగా, సంజయ్‌నగరలోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడిచేసి ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. (ఆయనతో డ్యాన్స్ చేశా అంతే..) -
నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. సీసీబీకి సహకరించని నిందితుడు వీరేన్ ఖన్నాకు నార్కోటెస్ట్ నిర్వహించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. నార్కోటెస్ట్‌లను నిర్వహించటానికి అహమ్మదాబాద్ లేదా హైదరాబాద్‌కు ఖన్నాను తీసుకెళ్లాలని సీసీబీ నిర్ణయించింది. అయితే నార్కోటెస్ట్‌కు వీరేన్ ఖన్నా అంగీకరించలేదని తెలుస్తోంది. ఖన్నా నివాసం ఉన్న ఫ్లాట్స్‌పై సీసీబీ దాడి చేసి పోలీస్ యూనిఫామ్, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. గోడును వెళ్లబోస్తున్న యాంకర్ అనుశ్రీ ఎఫ్ఎస్ఎల్కు ఆనవాళ్లు అరెస్ట్ చేసిన నిందితుల రక్తం, వెంట్రుకలు, మొబైల్ ఫోన్లను హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్కు పంపామని జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని, కేసు విచారణకు ఆటంకం కలగలేదన్నారు. (ఆయనతో డ్యాన్స్ చేశా అంతే..) విదేశీ పెడ్లర్లతో సంబంధాలు విదేశీ పెడ్లర్లతో నటీమణులు రాగిణి, సంజన గల్రానిలకు చాటింగ్ చేసినట్లు సీసీబీ ఆధారాలు సేకరించింది. వీరు లూమ్ సెప్పర్ నుంచి నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. కొనుగోలు చేసిన డ్రగ్స్‌తో బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్‌లలో పారీ్టలు ఏర్పాటు చేసినట్లు సాక్ష్యాలు లభించాయి. లేడీరౌడీ కోసం గాలింపు శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఐఎస్డీ పోలీసులు లేడీరౌడీ కోసం గాలిస్తున్నారు. ఐఎస్డీ పోలీసులు ఇద్దరు పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బుల్లితెర నటీ–నటులతో పాటు లేడీరౌడీ పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగరంలోని కొందరు రౌడీలతో సంప్రదించిన లేడీ రౌడీ కోసం గాలిస్తున్నారు. ఆమెపై నగరంలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) విచారించినంత మాత్రాన నేరస్తురాలిని కాను ! తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తాను నేరస్తురాలిని కాదని యాంకర్ అనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఆవేదనతో కూడిన వీడియోను అప్లోడ్ చేశారు. తనకు తెలిసిన మేరకు సీసీబీ అధికారులకు వివరాలు అందించా, తాను ఎలాంటి తప్పు చేయలేదని కన్నీరు మున్నీరయ్యారు. -
ఆయనతో డ్యాన్స్ చేశా అంతే..
సాక్షి, కర్ణాటక: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో పేరుపొందిన కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దీనిపై అనుశ్రీ స్పందిస్తూ 10 ఏళ్ల కిందట కిశోర్‌శెట్టి జతలో డ్యాన్స్ చేశాను అంతే, అతనితో నాకు అంత పరిచయం లేదు అని చెప్పారు. డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్‌శెట్టిని మంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడు విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం అనుశ్రీకి నోటీసులు పంపడంతో డ్రగ్స్ బాగోతం మరిన్ని మలుపులు తిరిగేలా ఉంది. మంగళూరుకు చెందిన అనుశ్రీ బెంగళూరులో స్థిరపడ్డారు. టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఇక కిశోర్‌శెట్టి బెంగళూరులో కార్తీక్‌శెట్టి అనే నిందితునితో కలిసి కాలేజీల వద్ద డ్రగ్స్ అమ్మేవాడని తేలింది. దీంతో కిశోర్‌శెట్టిని విచారణకు బెంగళూరుకు తీసుకురానున్నారు. పెడ్లర్స్ ముఠా నేత కోసం గాలింపు బెంగళూరు నుండి గోవా, మంగళూరుకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠాను బెంగళూరు సీసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ముఠా నాయకుని కోసం అన్వేషిస్తున్నారు. ఇతనికి మాఫియా డాన్లతో సంబంధాలున్నట్లు తేలింది. ముఠా నాయకుని పేరును సీసీబీ బయట పెట్టడంలేదు. (రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే) ఐఎస్డీ నుండి సీసీబీ కేసు బదిలీ డ్రగ్స్ కేసును ఐఎస్డీ, సీసీబీ విభాగాలు విచారిస్తున్నాయి. రెండు సంస్థల దర్యాప్తు వల్ల గందరగోళం ఏర్పడవచ్చని భావించిన ఉన్నతాధికారులు మొత్తం దర్యాప్తును సీసీబీకే అప్పగించాలని నిర్ణయించారు. ఐఎస్డీ ఎడీజీపీ భాస్కర్‌రావ్, డీజీపీ ప్రవీణ్ సూద్ సమావేశమై చర్చించారు. మళ్లీ దిగంత్‌కు నోటీసులు? నటుడు దిగంత్ తన మొబైల్‌ఫోన్‌లోని సమాచారాన్ని నాశనం చేశారని సీసీబీ అనుమానిస్తోంది. వారంలో ఒకరోజు సమాచారాన్ని డిలిట్ చేస్తానని దిగంత్ విచారణలో చెప్పాడు. అతన్ని ఇప్పటివరకు రెండుసార్లు సీసీబీ ప్రశ్నించడం తెలిసిందే. కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలపై మరోసారి విచారణకు పిలిపించే అవకాశముంది. డ్రగ్స్ పారీ్టలు జరిపించారనే ఆరోపణలపై ఒక రిసార్ట్ యజమాని కార్తీక్ అలియాస్ రాజును సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలోనున్న శివప్రకాశ్, అదిత్య ఆళ్వ, షేక్ ఫాజల్ కోసం సీసీబీ గాలిస్తోంది. (డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్) -
మణికొండలో కిడ్నాపైన బాలిక క్షేమం
-
భర్తపై న్యూస్‌రీడర్ ఫిర్యాదు
హైదరాబాద్: కేసు ఉపసంహరించుకోవాలని తన భర్త బెదిరిస్తున్నాడని ఓ న్యూస్‌రీడర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఓ న్యూస్‌చానల్‌లో పని చేస్తున్న అనుశ్రీ అనే న్యూస్ రీడర్‌కు ఎస్.మల్లికార్జున్‌రావుతో పెళ్లైంది. అయితే మల్లికార్జున్‌రావు ఇటీవల అనుశ్రీకి తెలియకుండా మరో వివాహం చేసుకునేందుకు సిద్ధం కాగా ఎస్సార్‌నగర్ పోలీసుల సహాయంతో ఆపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 498ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా మల్లికార్జున్‌రావు ఆమె పనిచేస్తున్న చానల్ కార్యాలయం వద్ద వెళ్లి బెదిరించడంతో పాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లికార్జున్‌రావుపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.