భర్తపై న్యూస్‌రీడర్ ఫిర్యాదు | Telugu News Reader Complaint Against Husband | Sakshi
Sakshi News home page

భర్తపై న్యూస్‌రీడర్ ఫిర్యాదు

Published Mon, Jul 28 2014 7:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

భర్తపై న్యూస్‌రీడర్ ఫిర్యాదు - Sakshi

భర్తపై న్యూస్‌రీడర్ ఫిర్యాదు

హైదరాబాద్: కేసు ఉపసంహరించుకోవాలని తన భర్త బెదిరిస్తున్నాడని ఓ న్యూస్‌రీడర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఓ న్యూస్‌చానల్‌లో పని చేస్తున్న అనుశ్రీ అనే న్యూస్ రీడర్‌కు ఎస్.మల్లికార్జున్‌రావుతో పెళ్లైంది.  అయితే మల్లికార్జున్‌రావు ఇటీవల అనుశ్రీకి తెలియకుండా మరో వివాహం చేసుకునేందుకు సిద్ధం కాగా ఎస్సార్‌నగర్ పోలీసుల సహాయంతో ఆపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 498ఏ కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా మల్లికార్జున్‌రావు ఆమె పనిచేస్తున్న చానల్ కార్యాలయం వద్ద వెళ్లి బెదిరించడంతో పాటు విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లికార్జున్‌రావుపై ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement