బిర్యానీ ఫెస్టివల్‌.. | Biryani Festival in ameerpet adithya hotel | Sakshi

బిర్యానీ ఫెస్టివల్‌..

Aug 11 2016 10:42 PM | Updated on Sep 4 2017 8:52 AM

బిర్యానీ ఫెస్టివల్‌..

బిర్యానీ ఫెస్టివల్‌..

నోరూరించే వంటకాలు బిర్యానీ ఫుడ్‌ ఫెస్టివల్‌’లో భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి.

అమీర్‌పేట: నోరూరించే వంటకాలు ‘పరాఠా, బిర్యానీ ఫుడ్‌ ఫెస్టివల్‌’లో భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. అమీర్‌పేట ఆదిత్య పార్క్‌ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్‌ ఈనెల 21 వరకు కొనసాగుతుందని హోటల్‌ యాజమాన్యం గురువారం  తెలిపింది. హోటల్‌ మాస్టర్‌ చెఫ్‌ ఎన్‌.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. శాఖాహారుల కోసం సబ్జి బిర్యానీ, మష్రూమ్, మక్కాయ్, కాబూలి, ఆవకాయ, పచ్చి మిరపకాయ బిర్యానీ, మాంసాహారులకు గోస్త్, ముర్గ్, నూర్‌ మహల్‌ ముర్గ్,

అండా కగినా, ఆవాధి, మలాయ్‌ మహి, అంబర్‌ (మటన్‌) లేహా బిర్యానీతో బఫెట్‌ను అందుబాటులో ఉంచుతున్నావున్నారు. గులాబ్‌ ఫర్ని, గులాబ్‌ జామూన్, బేక్ట్‌ రసమలాయి, గాజర్‌ హల్వా, మిల్లి ఫుల్లి, డబుల్‌ కా మీఠా వంటి డెజర్ట్స్, బేక్ట్, పేస్ట్రీలు ప్రత్యేకమన్నారు. ప్రతి రోజు రాత్రి 7.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ వంటకాలను ఆస్వాదించవచ్చని హోటల్‌ మేనేజర్‌ డి.వసంత్‌కుమార్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement