విశ్వనగరిలో రోడ్డు ప్రయాణం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. మొన్న ట్యాంక్ బండ్ పై చోటుచేసుకున్న తరహాలోనే రద్దీ ప్రాంతమైన అమీర్ పేట్ లోనూ రోడ్డుపై గొయ్యి ఏర్పడింది. శనివారం సాయంత్రం ఆ ప్రాంతంలో వర్షం కురిసి వెలిసిన కొద్ది సేపటికే రోడ్డు కుంగిపోయి, గొయ్యి ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు చెప్పారు.