
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమీర్‌పేట: శుభకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో కలిసి ఓ మహిళ దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అసభ్యకరంగా కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల సమాచారం మేరకు.. వెంగళరావునగర్‌లో ఉండే ఓ గృహిణి భర్తతో కలిసి ఇటీవల జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైంది.
అక్కడికి సమీప బంధువైన కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా రావడంతో పక్కపక్క కూర్చుని ఫొటోలు దిగారు. అయితే కొందరు వ్యక్తులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆడియోలోఅసభ్యకరమైన కామెంట్లు పెట్టి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీంతో సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
చదవండి: Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది
చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment