సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో మెట్రో రైల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాగోల్ నుంచి హైటెక్ సీటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. మెట్రో పిల్లర్ పైనుంచి ఓ ఇనుపరాడ్ కిందపడింది. రోడ్డుపై జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైల్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న మెట్రో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చెరుకొని మరమ్మతులు చేస్తున్నారు. రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులను కిందకు దించేశారు. మరమ్మతుల నిమిత్త అమీర్‌పేట్- నాగోల్ రూట్‌లో మెట్రో సర్వీసులు నిలిపివేశారు.
అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్
Published Tue, Nov 19 2019 7:34 PM | Last Updated on Tue, Nov 19 2019 8:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment