
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం తెల్లవారుజామున అతి వేగంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనలో ఓ యువకుడి తల మెట్రో స్టేషన్ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..)
Comments
Please login to add a commentAdd a comment