
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి... పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. అయితే, ఉదయం సమయం కావడం.. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేకపోవడం, దుకాణాలు మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 15మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అమీర్‌పేట్‌లోనే ఆదివారం మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి మౌనిక అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేపింది.
చదవండి: మౌనిక మృతి: 20 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం