
అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్ సంస్థ మోసం
హైదరాబాద్: హైదరాబాద్ అమీర్‌పేటలో ఎంఎన్‌ఎస్ అనే ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు వసూలు చేసిన సంస్థ ఎనిమిది నెలలైనా ఉద్యోగాలు చూపించకపోవడంతో బాధితులు శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల నుంచి మొత్తం రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.