
విశ్వశాంతి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్(అమీర్‌పేట): సినీ ఆర్టిస్ట్, టీవీ యాంకర్‌గా పని చేస్తున్న పర్తి విశ్వశాంతి (33) మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిబ్‌జీ రెసిడెన్సీ చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్.5లో అద్దె ఉంటున్న ఈమె గత మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. బెడ్‌రూంలో విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాళ్లు బెడ్‌పై, ముఖం నేలపై పడి ముఖం మీద గాయాలై రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. గదిలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. టీపాయ్ మీద స్నాక్స్ ఉండటంతో తీసుకోవడానికి వెళ్లి మద్యం మత్తులో అదుపుతప్ప కిందిపడి చనిపోయి ఉండవచ్చు లేదా ఎవరైనా చంపేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. మృతరాలి తల్లి ఇటీవలే సొంత ఊరికి వెళ్లిందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment