అమీర్‌పేటలో అగ్నిప్రమాదం | Fire accident in Ameerpet | Sakshi
Sakshi News home page

అమీర్‌పేటలో అగ్నిప్రమాదం

Published Sat, Apr 9 2016 3:43 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Ameerpet

హైదరాబాద్‌ : అమీర్‌పేటలోని నైస్ బెడ్ వర్క్స్ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న సామాగ్రితో సహా పరుపులు, దుప్పట్లు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం మూడు ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకోవడంతో చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement