
అమీర్‌పేట: విభిన్న ఆహార రుచులకు హైదరాబద్ కేరాఫ్‌గా నిలుస్తోందని సినీ నటి సభా నటేష్ అన్నారు. అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటైన జిస్మత్ మండి అరబిక్ జైల్ థీమ్ రెస్టారెంట్‌ను టాలివుడ్ నటి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు జైల్ థీమ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో జిస్మత్ అరబిక్ మండీలు ఉన్నాయని, త్వరలో ఏఎస్‌రావునగర్, దిల్‌సుఖ్‌నగర్, ఏలూరుతో పాటు బెంగుళూరులో తమ శాఖలను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు యూట్యూబర్ గౌతమి, ధర్మా తెలిపారు. మండీలను జైలును తలపించే తరహాలో తీర్చిదిద్దామని, ఖైదీల వేషధారణలో కారాగారం డైనింగ్ సెటఫ్‌లో కూర్చునే ఆహార ప్రియులకు ఆహారం అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ, టీఆర్‌ఎస్ నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు.