
అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని దుస్తుల దుకాణంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కనకదుర్గ ఆలయ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగటంతో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.