సినిమా విడుదల కాలేదని నిర్మాత ... | Movie producer suicide attempt in karnataka | Sakshi
Sakshi News home page

సినిమా విడుదల కాలేదని నిర్మాత ...

Published Sat, Feb 20 2016 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

సినిమా విడుదల కాలేదని నిర్మాత ...

సినిమా విడుదల కాలేదని నిర్మాత ...

బెంగళూరు :  దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన సినిమా విడుదలకు నోచుకోకపోవవంతో మనోవేదనకు గురైన సినీ నిర్మాత, దర్శకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... నందినీ లేఔట్‌కు చెందిన శశికుమార్ రెండు సంవత్సరాల క్రితం నూతన కథానాయకుడు సందీప్‌తో ఆఫ్ మెంటల్ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు.

చిత్రీకరణ, ఇతర వ్యవహారాలు పూర్తయి  యేడాది గడిచినా ఇప్పటి వరకు ఆ సినిమా మాత్రం విడుదల కాలేదు.  దీంతో మనోవేదనకు గురైన ఆయన గురువారం కారులో బయటకు వచ్చి కామాక్షిపాళ్య బస్టాండు సమీంపలో నీరు బాటిల్‌లో పురుగుల మందు కలుపుకొని తాగాడు. కొద్దిసేపటికి భార్య ఫోన్ చేయగా అతని మాటలు అస్పష్టంగా వినిపించాయి.

దీంతో ఆమె అతని స్నేహితులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనా స్థలానికి చేరుకొని అస్వస్థతకు గురైన  శశికుమార్‌ను అక్కడి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతన్ని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. సినిమా విడుదలకు మరింత డబ్బు అవసరమవుతుందని, అంత మొత్తంలో డబ్బు లేక ఆత్మహత్యకు యత్నించినట్లు శశికుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement